భారత్ లో ఫోర్త్ వేవ్..? సంకేతాలివే

భారత్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రెండు వేల నుంచి నేడు పదమూడు వేల కు చేరుకున్నాయి.

Update: 2022-06-18 06:11 GMT

భారత్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రెండు వేల నుంచి నేడు పదమూడు వేల కు చేరుకున్నాయి. ఇది ఫోర్త్ వేవ్ ప్రారంభమవడానికి సంకేతాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా భారత్ లో 13,216 కరోనా కేసులు నమోదయ్యాయి. 23 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రతి రోజూ వెయ్యికి పైగానే కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. కరోనా క్రమంగా విస్తరిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

యాక్టివ్ కేసులు......
దేశంలో ఇప్పటి వరకూ 4,32,83,793‬ కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 5,24,840 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 68,108 కి చేరుకున్నాయి. యాక్టివ్ కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి దేశంలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 4,26,90,845 మంది కోలుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నామని కరోనా నిబంధనలను పాటించకపోవడంతోనే కేసుల సంఖ్య పెరుగుతుందంటున్నారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,96,00,42,768 వ్యాక్సిన్ డోసులు వేశారు.


Tags:    

Similar News