కేసులు తగ్గినా.. ముప్పు పొంచి ఉన్నట్లే
భారత్ లో కరోనా కేసులు కొంత తగ్గాయి. ఒక్కరోజులోనే 16,167 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా కారణంగా 41 మంది మరణించారు
భారత్ లో కరోనా కేసులు కొంత తగ్గాయి. ఒక్కరోజులోనే 16,167 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా కారణంగా 41 మంది మరణించారు. అయితే పాజిటివిటీ రేటు 6.14 శాతంగా నమోదయింది. నిన్న ఒక్కరోజులోనే 15,549 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు శాతం 98.50 శాతంగా ఉందని, యాక్టివ్ కేసుల రేటు 0.31 శాతంగా నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. కేసులు తగ్గినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా వైరస్ పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కోవిడ్ నిబంధనలను ....
భౌతిక దూరం పాటించడం, మాస్క్ లను ధరించడం వంటి కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు పర్చాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,34,99,659 గా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 5,26,730 మంది మరణించారు. కాగా ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 1,35,510 వరకూ ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వ్యాక్సిన్ ను వేయించుకోవాలని అధికారులు తెలిపారు.