భారత్ లో భారీగా కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్నటి వరకూ మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటకలోనే ఎక్కువగా నమోదయ్యాయి

Update: 2022-07-02 06:06 GMT

భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్నటి వరకూ మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటకలోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఒక్కరోజులోనే 17,092 మంది భారత్ లో కరోనా వైరస్ బారిన పడ్డారు. 29 మంది కరోనా కారణంగా మరణించారు. రోజువారీ పాజిటివిటీ శాతం 4.14 శాతానికి చేరుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని అన్ని రాష్ట్రాలను కోరింది.

రోజురోజుకూ...
భారత్ లో ఇప్పటి వరకూ 4,34,86,326 కరోనా కేసులు నమోదయినట్లు భారత వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 5,25,168 మంది మరణించారు. యాక్టివ్ కేసులు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో 1,09,568 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,28,51,590 గా ఉంది. వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతున్నా కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఇప్పటి వరకూ భారత్ లో 1,97,84,80,015 డోసులు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Tags:    

Similar News