భారత్ లో పెరుగుతున్న కేసులు

భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులో 15,754 కరోనా కేసులు దేశంలో నమోదయ్యాయి.

Update: 2022-08-19 04:38 GMT

భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులో 15,754 కరోనా కేసులు దేశంలో నమోదయ్యాయి. 47 మంది కరోనాతో మరణించారు. నిన్న ఒక్కరోజులోనే 15,220 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.58 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసుల శాతం 0.23 శాతంగా ఉంది. రోజు వారీ పాజిటివిటీ రేటు 3.47 శాతంగా ఉందని అధికారులు తెలిపారు.

కోవిడ్ నిబంధనలను...
కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఖచ్చితంగా మాస్క్, భౌతికదూరం పాటించాలని చెబుతున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు దేశంలో ఇప్పటి వరకూ 4,43,14,61 నమోదయ్యాయి. వీటిలో 4,36,85,535 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 5,27,253 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 1,01,830 యాక్టివ్ కేసులున్నాయి. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News