భారత్ లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా

భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు , కోవిడ్ నిబంధనలను పాటించకపోవడంతోనే కేసుల సంఖ్య పెరుగుతోంది.

Update: 2022-08-11 05:23 GMT

భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా లేకపోవడం, కోవిడ్ నిబంధనలను పాటించకపోవడంతోనే కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరోజులోనే 16,299 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 53 మంది కరోనా బారిన పడి మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఒక్కరోజులో 19,431 మంది కరోనా నుంచి కోలుకోవడం కొంత ఊరట కల్గించే అంశమే. అయితే రోజువారీ రికవరీ రేటు శాతం 98.53 గా ఉందని అధికారులు చెబుతున్నారు. యాక్టివ్ కేసులు 0.28 శాతంగా ఉన్నాయి.

అప్రమత్తంగా లేకుంటే...
భారత్ లో ఇప్పటి వరకూ 4,42,06,996 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో 4,35,55,041 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకూ 5,26,879 మంది మరణించారు. ఇక ప్రస్తుతం యాక్టివ్ కేసులు భారత్ లో 1,25,076 ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలు అమలయ్యే చూడాలని సూచించింది.


Tags:    

Similar News