వామ్మో .. ఒక్కరోజులోనే ఇన్ని కేసులా?

భారత్ లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 18,819 మందికి కరోనా సోకింది. 39 మంది కరోనాతో మరణించారు

Update: 2022-06-30 05:58 GMT

భారత్ లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 18,819 మందికి కరోనా సోకింది. 39 మంది కరోనాతో మరణించారు. నిన్న ఒక్కరోజులోనే 13,827 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కోలుకున్న వారి శాతం 98.55 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. యాక్టివ్ కేసుల శాతం 024. శాతంగా నమోదయింది. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే రోజుకు లక్ష కేసులు కూడా నమోదయ్యే అవకాశముంటుందన్న హెచ్చరికలు చేస్తున్నారు.

లక్ష దాటిన యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం దేశంలో ఇప్పటి వరకూ 4,34,52,164 కరోనా కేసులు నమోదయిన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా భారత్ లో 5,25,116 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 1,04,555 కు చేరుకున్నాయి. దేశంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడి 4,28,22,493 మంది కోలుకున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ డోసులు 1,97,61,91,554 వేసినట్లు అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News