కరోనా ముప్పు ఇంకా తొలగలేదట

భారత్ లో ఇప్పటి వరకూ 4,45,58,425 మంది కరోనా వైరస్ బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు

Update: 2022-09-23 05:03 GMT

భారత్ లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పెద్ద సంఖ్యలో కాకపోయినా ప్రతి రోజు ఐదు వేల కేసులు నమోదవుతున్నాయి. ఇది ఆందోళనకు గురి చేసే అంశమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని గుర్తుంచుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు. ఒక్కరోజులో 5,383 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కోవిడ్ కారణంగా 20 మంది ఒక్కరోజులోనే మరణించారు. రికవరీ రేటు శాతం 98.71 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసుల శాతం 0.10 శఆతంగా ఉందని అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకూ....
భారత్ లో ఇప్పటి వరకూ 4,45,58,425 మంది కరోనా వైరస్ బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో కరోనా చికిత్స పొంది 4,39,84,695 మంది కోలుకున్నారని కేంద్ర వైద్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా కారణంగా 5,28,449 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 45,281 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో కరోనా వ్యాక్సిన్ డోసులు 217.26 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News