భారత్ లో ఆగని కరోనా
ఒక్కరోజులోనే 19,673 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 39 మంది కరోనా కారణంగా మరణించారు.
దేశంలో కరోనా కేసుల వ్యాప్తి తగ్గడం లేదు. వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లనే కరోనా వ్యాప్తి పెరుగుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. భౌతికదూరం పాటించకపోవడం, మాస్క్ లను ధరించకుండా అజాగ్రత్తతోనే భారీగా భారత్ లో కేసులు నమోదవుతున్నాయని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. ఒక్కరోజులోనే 19,673 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 39 మంది కరోనా కారణంగా మరణించారు.
రికవరీ రేటు...
మరోవైపు రికవరీ రేటు 98.48 శాతంగా నమోదయిందని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ భారత్ లో 4,40,19,811 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో 4,33,49,778 మంది కోలుకున్నారు. ప్రస్తుతం భారత్ లో 1,43,676 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 5,26,357 మంది మరణించారని వైద్య శాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతుంది. ఇప్పటి వరకూ దేశంలో 204.25 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.