భారత్ లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

కొత్తగా దేశంలో 15,940 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 20 మంది కరోనా కారణంగా చనిపోయారు.

Update: 2022-06-25 04:36 GMT

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్నటి తో పోలిస్తే కొంత తగ్గుముఖం పట్టాయి. కొత్తగా దేశంలో 15,940 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 20 మంది కరోనా కారణంగా చనిపోయారు. నిన్న 12,425 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోలుకున్న వారి శాథం 98.59 శాతంగా ఉండగా, యాక్టివ్ కేసుల శాతం 0.20 గా నమోదయిందని పేర్కొంది.

పెరుగుతున్న యాక్టివ్ కేసులు...
భారత్ లో ఇప్పటి వరకూ 4, 33,78,234 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 5,24,974 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య క్రమగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 91,779 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,27,61,481 గా నమోదయింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగం పెంచారు. ఇప్పటి వరకూ 1,96,94,40,932 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.


Tags:    

Similar News