భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు

భారత్ లో కొత్తగా 11,739 మందికి కరోనా వైరస్ సోకింది. కరోనా కారణంగా 25 మంది మరణించారు.

Update: 2022-06-26 04:54 GMT

గత మూడు రోజుల తర్వాత భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 11,739 మందికి కరోనా వైరస్ సోకింది. కరోనా కారణంగా 25 మంది మరణించారు. నిన్న కరోనా బారిన పడి 10,917 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోలుకునే వారి శాతం బాగానే పెరుగుతుంది. కోలుకునే వారి శాతం 98.58 శాతంగా నమోదయింది. రోజు వారీ పాజిటివిటీ రేటు 2.59కు తగ్గింది.

వ్యాక్సినేషన్ వేగంగా...
ఇప్పటి వరకూ దేశంలో 4,33,89,973 కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 5,24,999 మంది మరణించారు. యాక్టివ్ కేసుల బాగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో 92,576 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 4,27,72,398 మంది కోలుకున్నారని అధికారులు వెల్లడించారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,97,08,51,580 వ్యాక్సిన్ డోసులు వేసినట్లు అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News