వైరస్ చుట్టుముడుతోంది.. తస్మాత్ జాగ్రత్త

క్క రోజులో 19,893 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 53 మంది కరోనా కారణంగా మరణించారు.

Update: 2022-08-04 05:26 GMT

భారత్ లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. రోజురోజకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రజలు అప్రమత్తంగా లేకపోవడంతోనే కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజు వారీ పాజిటీవిటీ రేటు కూడా పెరుగుతుంది. తాజాగా దేశంలో రోజు వారీ పాజిటివిటీ రేటు 4.94 శాతంగా నమోదయిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఒక్క రోజులో 19,893 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 53 మంది కరోనా కారణంగా మరణించారు. మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

యాక్టివ్ కేసులు....
దేశంలో ఇప్పటి వరకూ 4,40,19,811 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4,34,24,029 మంది కోలుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా కారణంగా 5,26,530 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 1,36,478 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 205.22 కోట్ల మంది కోరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.


Tags:    

Similar News