తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుందే

ఒక్కరోజులోనే 9,062 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 36 మంది కరోనా కారణంగా మరణించారు.

Update: 2022-08-17 05:12 GMT

భారత్ లో కరోనా వైరస్ క్రమంగా తగ్గుతుంది. నిన్నటితో పోలిస్తే కొంత కేసుల సంఖ్య పెరిగాయి. ఒక్కరోజులోనే 9,062 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 36 మంది కరోనా కారణంగా మరణించారు. నిన్న ఒక్కరోజులోనే 15,220 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రికవరీ రేటు 98.56 శాతానికి చేరుకుంది. ఇక యాక్టివ్ కేసుల శాతం 0.25గా నమోదయింది. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను పాటించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు.

అప్రమత్తంగా లేకపోతే....
ప్రజలు అప్రమత్తంగా లేకపోతే కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.49 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 4,42,86,256 గా నమోదయింది. వీరిలో 4,36,54,064 కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 5,27,134 మంది మరణించారు. ప్రస్తుతం 1,05,058 కరోనా యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు.


Tags:    

Similar News