భారీగా తగ్గిన కరోనా కేసులు.. కారణమదేనా?
భారత్ లో 7,591 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. చాలా రోజుల తర్వాత అతి తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
భారత్ లో కరోనా కేసుల బాగా తగ్గాయి. ఒక్కరోజులో 7,591 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. చాలా రోజుల తర్వాత అతి తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అయితే నిన్న ఒక్కరోజులో 9,206 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.62 శాతానికి నమోయింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.19 శాతానికి తగ్గింది.
యాక్టివ్ కేసులు...
దేశంలో ఇప్పటి వరకూ 4,44,08,132 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4,38,02,993 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 5,27,799 మంది మరణించారు. ప్రస్తుతం 84,931 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు. యాక్టివ్ కేసులు తగ్గుతుండటం శుభపరిణామం. అయినా ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.