తగ్గుతున్నా... తగ్గనట్లే... కరోనా అలర్ట్

భారత్ లో ఒక్కరోజులో 41 మంది కరోనాతో మరణించారు. మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది

Update: 2022-08-27 07:25 GMT

భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఒక్కరోజులోనే 9,520 మందికి కరోనా వైరస్ బారిన పడ్డారు. 41 మంది కరోనాతో మరణించారు. మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. నిన్న ఒక్కరోజులోనే 12,875 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.62 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసులు 0.20 శాతం నమోదయినట్లు వెల్లడించారు.

మరణాల సంఖ్య....
దేశంలో ఇప్పటి వరకూ 4,43,98,696 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటి వరకూ కరోనా చికిత్స నుంచి 4,37,83,788 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకూ 5,27,597 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం దేశంలో 87,311 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతున్న అంశం ఊరట కలిగిస్తున్నప్పటికీ కరోనా కేసుల సంఖ్య ప్రతి రోజూ నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరగడంతో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News