భారత్ లో తగ్గిన కరోనా కేసులు

ఒక్కరోజులోనే 16,866 మంది కోరనా వైరస్ బారిన పడ్డారు. 41 మంది కరోనా కారణంగా మరణించారు

Update: 2022-07-25 05:20 GMT

భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా ఇరవై వేలకు పైగా నమోదవుతున్న కేసులు ఇప్పుడు తగ్గుతున్నాయి. ఒక్కరోజులోనే 16,866 మంది కోరనా వైరస్ బారిన పడ్డారు. 41 మంది కరోనా కారణంగా మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే కరోనా వైరస్ ననుంచి 18,148 మంది కోలుకున్నారు. కోలుకునే వారి శాతం 98.46 శాతంగా నమోదయిందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

జాగ్రత్తగా ఉండాలంటూ...
మరో వైపు ఇప్పటి వరకూ దేశంలో 4,39,05,641మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వారిలో 4,32,28,670 మంది ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 5,26,074 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 1,50,877 యాక్టివ్ కేసులు ఉన్నాయని భారత వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ ముప్పు తొలగి పోలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News