పాజిటివిటీ రేటు పెరుగుతోంది

ఒక్కరోజులో భారత్ లో 16,678 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 26 మంది కరోనా కారణంగా మరణించారు.

Update: 2022-07-11 05:23 GMT

దేశంలో కరోనా సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. గత వారం పది రోజుల నుంచి ఇరవై వేల నుంచి పద్ధెనిమిది వేల వరకూ కేసులు నమోదవుతుండగా ఈరోజు కొంత సంఖ్య తగ్గడం ఊరట కల్గించే అంశమే. ఒక్కరోజులో భారత్ లో 16,678 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 26 మంది కరోనా కారణంగా మరణించారు. కరోనా నుంచి కోలుకునే వారి శాతం 98.51 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు మాత్రం 5.99 శాతానికి పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

యాక్టివ్ కేసులు...
భారత్ లో ఇప్పటి వరకూ 4,36,39,329 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 5,25,454 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 1,30,713 కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 4,29,83,162 మంది కోలుకున్నారని చెప్పారు. వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,98,88,77,537కు చేరుకుంది.


Tags:    

Similar News