తగ్గినట్లే కనిపిస్తున్నా.. డేంజర్ బెల్స్

ఒక్కరోజులోనే భారత్ లో 16,561 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 49 మంది కరోనా కారణంగా మరణించారు

Update: 2022-08-12 05:33 GMT

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే కొంత తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజులోనే 16,561 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 49 మంది కరోనా కారణంగా మరణించారు. నిన్న ఒక్కరోజులోనే 18,053 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఎక్కువ మంది ఆసుపత్రి పాలు కాకుండానే కోలుకుంటుండం కొంత ఊరట నిచ్చే అంశమే అయినప్పటికీ కేసులు సంఖ్య తగ్గడానికి ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు.

యాక్టివ్ కేసులు....
ఇప్పటి వరకూ దేశంలో కరోనా కారణంగా 4,42,23,557 మంది కోవిడ్ బారిన పడ్డారు. వీరిలో 4,35,73,094 మంది ఇప్పటి వరకూ కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. పాజిటివిటీ రుటు 4.85 శాతంా ఉంది. రికవరీ రేటు 98.53 శాతంగాను, యక్టివ్ కేసులు 0.28 శాతంగానూ ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా కారణంగా 5,26,928 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో కరోనా వైరస్ యాక్టివ్ కేసులు 1,23,535 ఉన్నాయని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News