సుప్రీంకోర్టు కీలక తీర్పు ఏం చెప్పిందంటే?
రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను ఆమోదం తెలపడంపై సుప్రీంకోర్టులో కీలక తీర్పు వెలువరరించింది.
రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను ఆమోదం తెలపడంపై సుప్రీంకోర్టులో కీలక తీర్పు వెలువరరించింది. బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతికి గడువు విధింపు పై నేడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లుల విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదం చేయాలన్న దానిపై ఎటువంటి నిర్ణయాలను వెలువరించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. కోర్టులకు పరిమితంగానే ఈ విషయంలో అవకాశాలుంటాయని చెప్పింది. బిల్లులను ఆమోదించడానికి గవర్నర్లకు, రాష్ట్రపతికి గడువు విధించలేమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అటువంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది.
గడువు విధించలేమని...
ఈ నేపథ్యంలో రాష్ట్రపతికి, గవర్నర్లకు బిల్లులు ఆమోదానికి సంబంధించి గడువు విధించడంపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అన్ని పక్షాల వాదనలు విని సెప్టెంబర్ 11న తీర్పు సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. నేడు తీర్పు వెలువరించింది. గవర్నర్ల ముందు మూడే ఆప్షన్లున్నాయని, ఒకటి రాష్ట్రపతికి పంపడం, రెండు తిరిగి పంపడం, మూడు తిరస్కరించడం వంటివి మాత్రమే చేయగలుగుతారని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే అదే సమయంలో అసాధరణ రీతిలో సమయం బిల్లుల ఆమోదానికి తీసుకుంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందని మాత్రం తెలిపింది.