ఖుషీ సినిమా రివ్యూ

చివరి గంటలో లీడ్ పెయిర్ మధ్య వచ్చే సన్నివేశాలన్నీ కపుల్స్, యూత్ కు బాగా నచ్చుతాయి

Update: 2023-09-01 11:20 GMT

విడుదల తేదీ: సెప్టెంబర్ 1, 2023

నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, జయరామ్, సచిన్ ఖేడాకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి మొల్లేటి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగర్, శరణ్య ప్రదీప్
దర్శకుడు: శివ నిర్వాణ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్
సంగీత దర్శకుడు: హేషమ్ అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రాఫర్: జి. మురళి
ఎడిటర్: ప్రవీణ్ పూడి

కథ:
BSNLలో పనిచేసే విప్లవ్ (విజయ్ దేవరకొండ) ఉద్యోగ రీత్యా జమ్మూ కశ్మీర్ కు వెళతాడు. అక్కడ ఆరాధ్య (సమంత)ని చూసిన వెంటనే ప్రేమలో పడిపోతాడు. విప్లవ్‌ను తప్పించుకోవడానికి పాకిస్థానీ ముస్లిం అని చెబుతుంది. తన తమ్ముడు తప్పిపోయాడు అందుకే పాకిస్థాన్ నుండి కశ్మీర్ కు వచ్చానని అబద్ధం చెబుతుంది. అయితే విప్లవ్ చేసే ప్రయత్నం ఆరాధ్యకు కూడా నచ్చేస్తుంది. అతడి ప్రేమను అర్థం చేసుకుంటుంది. అయితే ఆమె సంప్రదాయవాద బ్రాహ్మణ కుటుంబానికి చెందినది. విప్లవ్ తండ్రి లెనిన్ సత్యం (సచిన్ ఖేడేకర్) నాస్తికుడు కాగా.. ఆరాధ్య తండ్రి చదరంగం శ్రీనివాసరావు (మురళీ శర్మ) గొప్ప ప్రవచనకర్త. వీళ్ళలో వీళ్లకు పడదు. అలాంటి కుటుంబాలకు చెందిన వీళ్లు పెళ్లి జరిగిందా.. వారి వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు. అనేది మిగిలిన కథ
ప్లస్ పాయింట్లు:
ఈ చిత్రం కొత్త కథ అయితే కాదు. కానీ రిలేషన్ షిప్ లో ఉన్న వ్యక్తులకు సంబంధించిన బంధం, అనుబంధం గురించి చర్చించారు. ఫస్ట్ హాఫ్.. లవ్ స్టోరీ.. మంచి విజువల్స్ తో సాగిపోతుంది. మంచి సంగీతం, రిచ్ విజువల్స్‌తో ఉన్న సినిమా.
చివరి గంటలో లీడ్ పెయిర్ మధ్య వచ్చే సన్నివేశాలన్నీ కపుల్స్, యూత్ కు బాగా నచ్చుతాయి. సన్నివేశాలు కొత్తవి కావు, కానీ అవి కన్విన్సింగ్ పద్ధతిలో చూపించారు. విప్లవ్‌గా విజయ్ దేవరకొండ బాగా నటించాడు. విజయ్ కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ లో మెప్పించాడు. సమంత ఆరాధ్యగా బాగా నటించింది, ఎమోషనల్ సీన్స్ లో చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది. విజయ్ దేవరకొండతో ఆమె కెమిస్ట్రీ బాగుంది. వినోదం బాగానే ఉంది. చివరి గంటలో భావోద్వేగాలకు కనెక్ట్ అవుతాము. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సినిమాకు ప్లస్. పాటలు అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ మురళి కూడా ఆకట్టుకునేలా చిత్రీకరించారు. నిర్మాణ విలువల విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ రాజీ పడలేదు.
మైనస్ పాయింట్లు:
ముఖ్యంగా కొత్త కథ కాదు. ప్రెడిక్టబుల్ కథ లాగే అనిపిస్తుంది. చాలా సన్నివేశాలను ఊహించవచ్చు. సినిమా నిడివి ఎక్కువగా ఉంది, ఎడిటింగ్ టీమ్ కొన్ని సన్నివేశాలను కత్తిరించి ఉండవచ్చు. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఊపు సెకండాఫ్ లో లేదని అనిపిస్తుంది. క్లైమాక్స్ తప్పకుండా ఊహించేస్తారు. ఇంకాస్త మెరుగ్గా ఉండి ఉంటే బాగున్ను.

రేటింగ్: 2.75/5


Tags:    

Similar News