OG Movie Review : ఓజీ మజా ఆగయా..పవన్ మాస్టర్ స్ట్రోక్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ విడుదలయింది. ప్రేక్షకులకు కనెక్ట్ అయింది.

Update: 2025-09-25 04:02 GMT

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ విడుదలయింది. ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ మంచి హిట్ అందుకున్నారన్న టాక్ వినపడుతుంది. ఓవర్సీస్ లో కానీ, ప్రీమియర్ షోలు చూసి వచ్చిన వారు కూడా పవన్ కల్యాణ్ ఓజీ మూవీ పట్ల పాజిటివ్ టాక్ చెబుతున్నారు. ఒకరకంగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ సినిమాలు చేస్తూ చిత్ర పరిశ్రమలో సాలిడ్ కమ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. పూర్తిగా పవన్ కల్యాణ్ తోనే ఈ మూవీ హిట్ అయిందన్న టాక్ వినిపిస్తుంది.

గ్యాంగ్ స్టర్ పాత్రలో...
దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఓజీ మూవీ నిన్ననే ప్రీమియర్ షోలతో విడుదలయింది. పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో పోషించడం ఈ మూవీకి మరింత హైప్ తెచ్చింది. తొలి నుంచి ఓజీ మూవీపై భారీ అంచనాలున్నాయి. టోక్యో నేపథ్యంతో కథ మొదలై, ప్రధాన పాత్రలతో కనెక్ట్ అవుతూ సాగింది. ఆపై కథ ప్రకాశ్‌ రాజ్‌ వైపు మలుపు తిరిగింది. ప్రజల కోసం ఓ పోర్ట్‌ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ప్రకాశ్ రాజ్ ముందుకు వస్తారు. ఆ పనికి కావలసిన బంగారాన్ని తెచ్చే క్రమంలో సముద్రంలో దొంగల దాడికి గురవుతారు. ఆ సమయంలో పవన్‌ కళ్యాణ్‌ ఎంట్రీ ఇస్తారు. దొంగలను అణచి ప్రకాశ్‌ రాజ్‌ ప్రాణాలను కాపాడతారు.
బ్యాక్ గ్రౌండ్ స్కోరు...
ప్రకాశ్‌ రాజ్‌ కృతజ్ఞతగా బంగారం ఇవ్వగా, పవన్‌ తిరస్కరించి పోర్ట్‌ నిర్మాణంలో తన సహకారం అందిస్తానని చెబుతారు. పోర్ట్‌ పూర్తయ్యాక, దాన్ని స్వాధీనం చేసుకోవాలన్న శత్రువులు రంగంలోకి దిగతారు. అప్పుడు పవన్‌ మళ్లీ రంగంలోకి దిగి ప్రకాశ్‌ రాజ్‌ తోపాటు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తారు. అయితే అక్కడకక్కడ కుటుంబ సన్నివేశాలు కొంత బోరు కొట్టించారని, స్క్రీన్ ప్లే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమయింది. ఈ సినిమాకు తమన్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ హైలైట్‌ గాల నిలచింది. అయితే ట్విస్ట్‌లు, పవన్‌ కళ్యాణ్‌ ఫ్రెష్‌ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొత్తం మీద పవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత హిట్ కొట్టారంటూ ఆయన అభిమానులు "ఖుషీ" ఫీలవుతున్నారు.
Tags:    

Similar News