భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఓవరాల్ గా ఎలా ఉందంటే?
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. భార్యా భర్తలు మరియు స్నేహితురాలు మధ్య ట్రై యాంగిల్ స్టోరీగా ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. సంక్రాంతి పండగకు ముందు విడుదలయిన ఈ మూవీ ప్రేక్షకుల ఆదరణ పొందిందా? లేక రవితే ఖాతాలో మరొక ప్లాప్ నమోదయిందా? ప్రీమియర్ షోలు లేవు. సినిమా ఎలా ఉంది? రవితేజ నటన గురించి నెటిజన్లు ఏమంటున్నారు? ఆషికా రంగనాథ్ మరియు డింపుల్ హయాతితో మాస్ మహారాజా జత ఎలా ఉంటుంది? అన్నదానిపై రివ్యూ
చాలా రోజుల నుంచి...
మాస్ మహారాజా రవితేజ చాలా రోజుల నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సినిమాలు వరసగా విడుదలవుతున్నప్పటికీ గత కొంతకాలంగా ఒక్క హిట్ పడలేదు. అయినా రవితేజ నిరుత్సాహపడకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ సారి రవితేజ ఫ్యామిలీ డ్రామాను ఎంచుకున్నారు. రవితేజ సినిమా అంటే కామెడీ, యాక్షన్ కలగలపి ఉంటాయి. ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలోనూ అదే తరహాలో కామెడీ ట్రాక్ బాగా పండింది. ఇద్దరు భార్యభర్తలు. వారికి తమ కుటుంబం తప్ప మరొకటి తెలియదు.
పండిన కామెడీ...
అయితే వ్యాపార పనుల్లో భాగంగా రవితేజ స్పెయిన్ కు వెళతాడు. అక్కడ ఆషికా రంగనాధ్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి దగ్గరవుతాడు. అయితే తర్వాత ఈ విషయం భార్యకు తెలుస్తుంది. అపపుడు ఏం జరుగుతుంది. రవితేజ ఇద్దరి మధ్య ఎలా నలిగిపోతాడు? అన్నది తేలాలంటే ఈ మూవీ చూడాల్సిందే. కామెడీ ట్రాక్ పండింది. రవితేజ నటనతో పాటు కామెడీ కూడా పండటం ఫస్ట్ హాఫ్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతాడు. అయితే కథనంలో కొత్తదనం లేకపోవడం మైనస్. ఈ సంక్రాంతికి విడుదలయిన సినిమాల్లో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఖచ్చితంగా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది