Raja Saab : ‘రాజా సాబ్’ సంక్రాంతికి అలరించాడా? ఇబ్బంది పెట్టాడా?

డార్లింగ్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ విడుదలయింది

Update: 2026-01-09 04:39 GMT

డార్లింగ్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ విడుదలయింది. తొలి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. హారర్ అండ్ కామెడీ జోనర్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై మారుతి దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా టీజర్ నుంచి అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా రాజాసాబ్ మూవీ విడుదలయింది. అయితే సంక్రాంతి పండగకు వచ్చిన ఈ రాజాసాబ్ మూవీ ఎలా ఉందన్నదానిపై అనేక విధాలుగా సమీక్షలు వస్తున్నాయి.

మంచి స్పందన...
సినీ ప్రేక్షకుల నుంచి ‘రాజా సాబ్’కు మంచి స్పందన లభిస్తోంది. ప్రభాస్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌కు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. దర్శకుడు మారుతి దర్శకత్వానికి కూడా మొత్తంగా సానుకూల స్పందన కనిపిస్తుంది. ప్రభాస్ నటనతో పాటు లుక్ కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని మూవీ చూసిన వాల్లు చెబుతున్నారు. పాటలు ఈ సినిమాకు మరింత బలం చేకూర్చాయయి. కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంది. అయితే కొంత కథనంలో తడబాటు కనిపించినప్పటికీ రాజాసాబ్ మూవీ అందరినీ అలరిస్తుందని అంటున్నారు. హాస్యం కొన్ని చోట్ల వెగటుగా అనిపించిందన్న టాక్ కూడా వినిపిస్తుంది.
నటీనటుల నటన...
ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌, జరినా వాహబ్‌, బోమన్‌ ఇరానీ కీలకమైన, సీరియస్‌ పాత్రల్లో కనిపించారు. నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌, మాళవిక మోహనన్‌ గ్లామర్‌ పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం, రాజీవన్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సినిమా చూసినవారిలో ఇవే అంశాలు ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. హారర్, ఫాంటసీ మూవీ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్ ఇచ్చినట్లయిందని అంటున్నారు. ప్రభాస్ ను ఈ కోణంలో చూసేందుక ఫ్యాన్స్ నిన్నటి రాత్రి నుంచి థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మొత్తం మీద ది రాజా సాబ్ మూవీకి మిక్స్ డ్ టాక్ మాత్రం అక్కడకక్కడా వినిపిస్తున్నా... ప్రభాస్, మారుతి కాంబినేషన్ అదిరిపోయిందంటున్నారు.
























Tags:    

Similar News