Harihara Verra Mallu : పవన్ ఫ్యాన్స్ కు ఫీస్ట్.. నార్మల్ ఆడియన్స్ కు మాత్రం?
పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలయింది. అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్ తో నడుస్తుంది.
హరిహర వీరమల్లు సినిమా విడుదలయింది. అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్ తో నడుస్తుంది. అయితే ఈ సినిమా పై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇచ్చే మూవీ కావడంతో ఖచ్చితంగా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టడం ఖాయమని టాక్ వినిపించింది. అయితే ఈ సినిమా తీసిన విధానం ఎలా ఉంది? అందులో పవన్ నటన ఎలా ఉంది? ఇద్దరు దర్శకులతో ఇబ్బందులు ఎదురయ్యాయా? సంగీతం అలరించిందా? కథ ఆకట్టుకుందా? స్టోరీ లైన్ ప్రేక్షకుడిని కట్టిపడేస్తుందా? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ రివ్యూ. సనాతన ధర్మం పేరుతో ఇటీవల పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రచారానికి ఈ మూవీ ఒక కథానికగా మారిందనే అనుకోవాలి.
ఫస్టాఫ్ ఆకట్టుకున్నా...
మూవీ ఫస్టాఫ్ లో ఒక టార్గెట్ కోసం బందరు నుంచి గోల్కొండ దాకా వార్ కొనసాగిస్తే సెకండాఫ్ లో మాత్రం గోల్కొండ నుంచి ఎర్రకోట వరకు ధర్మం వైపు గుర్రపు స్వారీ చేయాల్సి వస్తుంది. రెండు లక్ష్యాల కోసం తను దారి మార్చుకోవాల్సి వచ్చిందా లేక తాను అనుకున్న దారిలో ప్రధాన లక్ష్యం పెట్టుకున్నారా అనేది హరిహర వీరమల్లు కథాంశం. పవన్ చారిత్రక నేపథ్యం ఉన్న పాత్రలో నటించడం ఇదే ఫస్ట్. ఇంతవరకూ ఇలాంటి సినిమాల్లో నటించకపోవడం కొత్త అనిపిస్తుంది. అభిమానులకు మాత్రం పండగే. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ సంగీతం మాత్రం అలరించింది. నిధి అగర్వాల్ స్క్రీన్ స్పేస్ కూడా తక్కువగా ఉండటం కొంత నిరాశ పర్చింది. ఫస్టాఫ్ మాత్రం బాగా అందరిని ఆకట్టుకుంది.
ఐదేళ్లు తీయడంతో...
ఐదేళ్లు సినిమా తీయడంతో పాటు ఇద్దరు డైరెక్టర్లు మారడంతో అతుకుల బొంతలా మారిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే పవన్ కోసం చూసేవాళ్లు కాకుండా నార్మల్ ఆడియన్స్ ఒకసారి చూడవచ్చన్నది కూడా వినపడుతుంది. కథనం పెద్దగా ఆకట్టుకునేలా స్క్రీన్ ప్లే ను రన్ చేయకపోవడం కూడా మైనస్ గా చెప్పాలి. ట్విస్ట్ లు లేవు.. కొన్ని సన్నివేశాలు మాత్రం ఆకట్టుకునేలా తీశారు. గ్రాఫిక్స్ లో లోపం మాత్రం స్పష్టంగా కనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నా దర్శకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రం చాలా రోజుల తర్వాత మంచి ఫీస్ట్ అవుతుంది కాని, సాధారణ ప్రజలకు మాత్రం యావరేజ్ మూవీగానే అంటున్నారు క్రిటిక్స్. కథలో కొత్తదనం లేకపోవడం కూడా మైనస్ అని చెప్పాలి.