ఆర్కే నాయుడు..అదరగొట్టాడా...? ఇన్విస్టిగేషన్ సినిమాలో హైలెట్ అయిందా?

ఆర్కే నాయుడు నటించిన మూవీ ది 100 సినిమాతో చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చేశారు. ఈ మూవీ నేడు విడుదలయింది.

Update: 2025-07-11 06:15 GMT

బుల్లి తెర ప్రేక్షకుల సూపర్ స్టార్ ఎవరు అంటే ఠక్కున ఆర్కే నాయుడు పేరు చెబుతారు. అనేక సీరియల్స్ ద్వారా మహిళల మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నారు. మొగిలి రేకులు సీరియల్ ద్వారా అందరి మనసులో హీరో అయ్యాడు. టీవీ సీరియల్స్ ను ఎక్కువగా మహిళలు చూసి ఉద్విగ్నతకు లోనవుతుంటారు. అందులో ఇన్ వాల్వ్ అయిపోతారు. మహిళలు ఎక్కువ మంది అభిమానించే ఆర్కే నాయుడు అలియాస్ సాగర్ కు వయసుతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ప్రతి ఇంట్లో ఉన్నారు. అందుకే ఆర్కే నాయుడు అంటే అంత అభిమానం. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి కూడా సాగర్ అంటే వల్లమాలిన అభిమానం. అంజనాదేవి తండ్రి పేరు కూడా ఆర్కే నాయుడు కావడంతో ఆమె ఆ పేరుతో ఉన్న సాగర్ ను అభిమానించేవారట.

పోలీస్ ఆఫీసర్ పాత్రలో...
అలాంటి ఆర్కే నాయుడు నటించిన మూవీ ది 100 సినిమాతో చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చేశారు. ఈ మూవీ నేడు విడుదలయింది. ఈ సినిమాలో ఆర్కే నాయుడు ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తుండగా ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే ఒడిశాకు చెందని దోపిడీ ముఠా కేసును చేధించే పనిలో పడతాడు. అయితే హీరోయిన్ ఆర్తి కూడా ఈ ఒడిశా ముఠా బాధితరులేనని తన దర్యాప్తులో తెలుసుకున్న సాగర్ ఆ ముఠాను వలపన్ని పట్టుకుంటాడు. కానీ ఆర్తికి జరిగిన అన్యాయంలో ఒడిశా ముఠా ప్రమేయం లేదని తెలుసుకుని దర్యాప్తును ఈ కేసులో మరింత లోతుగా చేస్తాడు. సినిమా యావత్తూ క్రైమ్ ఇన్విస్టిగేషన్ నేపథ్యంలోనే సాగుతుంది. అయితే ఇలాంటి కథలు గతంలో తెలుగులో బోలెడు వచ్చాయి.
ఆసక్తిని రేకెత్తించేలా...
కానీ అయితే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ ప్రయత్నం చేశాడు. దర్శకుడు చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. ఈ సినిమాలో ఆర్కే నాయుడు ఐపీఎస్ అధికారిగా అందరినీ మెప్పించాడు. ఫస్ట్ హాఫ్ లో క్రైమ్ ఇన్విస్టిగేషన్ మొదలు కావడంతో ప్రేక్షకుడు కుర్చీ నుంచి కదలడు. అయితే సినిమాలో వస్తున్న సీన్లు ప్రేక్షకుడు ఎప్పటికప్పుడు అంచనాలకు తగినట్లుగానే నడవటం రొటీన్ అని చెప్పలి. అయితే పరిశోధన విషయంలో ఈ మూవీకొంత సక్సెస్ అయిందనే చెప్పాలి. మొత్తం మీద బుల్లితెరపై మెప్పించి లక్షలాది మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న ఆర్కే నాయుడు ఈ మూవీలో కూడా బాగాకనిపించిమెప్పించాడన్న ప్రశంసలు అందుకున్నాడు. టాక్ మాత్రం పరవాలేదు అనిపించేలా ఉందన్నది టాలీవుడ్ వర్గాల టాక్.


Tags:    

Similar News