Mirai Movie : మిరాయ్ మూవీ ఎలా ఉందో తెలిస్తే?
తేజ సజ్జ నటించిన మిరాయ్ చిత్రం ఈరో్జు ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది.
తేజ సజ్జ నటించిన మిరాయ్ చిత్రం ఈరో్జు ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. గతంలో హనుమాన్ మూవీతో హిట్ కొట్టిన తేజ సజ్జ నటించిన సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, టీజీ విశ్వప్రసాద్ మూవీని నిర్మించారు. అయితే ఈ మూవీలో ప్రత్యేక ఆకర్షణగా మంచు మనోజ్ కూడా నటించడంతో మరింత హైప్ ఏర్పడింది. పీపుల్ మీడియా ఫాక్టరీ బ్యానర్ పై ఈచిత్రం విడుదలయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా మిరాయ్ విడుదల కావడంతో ఫస్ట్ టాక్ వచ్చేసింది
ఓవర్సీస్ లో...
ఈ సినిమాకు పాజిటివ్ టాక్ మాత్రం వచ్చిందనే చెప్పాలి. మిరాయిలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే.. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించడం మూవీకి అదనపు బలం సమకూర్చినట్లయిందన్న టాక్ బాగా వినపడుతుంది. అందువల్లనే పాజిటివ్ టాక్ మొదట్లోనే వచ్చిందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ అని అంటున్నారు. సెకండ్ హాఫ్ కొంత నెమ్మదిగా సాగినా పరవాలేదనిపించిందన్న టాక్ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టు చేస్తున్నారు.
పాజిటివ్ టాక్...
ఇక క్లైమాక్స్ ను అదిరిపోయే విధంగా చిత్రీకరిచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారంటున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. టెక్నికల్ గా మిరాయ్ ఎక్కడికో తీసుకెళ్లందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అందులోనూ మూవీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తుండటంతో కొంత మేర పరవాలేదనిపించేలా మూవీ ఉందన్న టాక్ వినిపిస్తుంది. నటీ నటులందరూ తమ పాత్రలకు న్యాయం చేయడంతో పాటు వీఎఫ్ఎక్స్ లు కూడా అద్భుతంగా ఉన్నాయని, తేజ సజ్జా మరొక హిట్ కొట్టారన్నది ఓవర్సీస్ టాక్ గా వినిపిస్తుంది.