అనగనగా ఒక రాజు.. ఎలా ఉందంటే? నవీన్ పోలిశెట్టి హిట్ కొట్టినట్లే?

నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా రాజు మూవీ నేడు విడుదలయింది

Update: 2026-01-14 07:09 GMT

నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా రాజు మూవీ నేడు విడుదలయింది. అయితే ఈ మూవీ మంచి టాక్ అందుకుంది. జాతిరత్నాల సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టి ఈ మూవీలో కూడా కామెడీ ట్రాక్ లో నడిపి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కొద్ది రోజుల క్రితం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రేక్షకుల నుంచి అంత ఆదరణ లభించకపోయినప్పటికీ ఈ మూవీ మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో కూడా నవీన్ పోలిశెట్టి విభిన్నంగా చేయడంతో అందరినీ ఆకట్టుకుందని అంటున్నారు.

రిలీజ్ రోజున టాక్...
సంక్రాంతి పండగకు ఇప్పటికే మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో ప్రభాస్ నటించిన రాజాసాబ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారూ, మాస్ మహారాజు నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు విడుదలయి థియేటర్లలో హల్ చల్ చేస్తున్నాయి. అభిమానులకు నిజమైన సంక్రాంతిని అందించారు. ఇక నవీన్ పోలిశెట్టి నటించిన మూవీ కూడా మంచి టాక్ తెచ్చుకోవడంతో ఈ మూవీ కూడా మంచి కలెక్షన్లు రాబడతాయంటున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.
కొత్త దనం లేకపోయినా...
సితార ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఫార్చ్యూన్ 4 సినిమాస్ నిర్మాత నాగవంశీ ఈ మూవీని నిర్మించారు. అయితే ప్రేక్షకుల నుంచి అందుతున్న వివరాలు ప్రకారం కథ కొత్తగా లేకపోయినా, నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షోగా సినిమాను తన భుజాలపై మోసుకుంటూ యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఎంగేజ్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు మంచి రిచ్ ఫీల్ ఇచ్చాయి. మీనాక్షి చౌదరి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. నవీన్‌తో ఆమె స్క్రీన్ పెయిర్ ఆకట్టుకునేలా ఉందన్న టాక్ స్ప్పెడ్ అయింది. మొత్తం మీద అనగగనగా రాజు సంక్రాంతికి మంచి వినోదాన్నిస్తుందని అంటున్నారు.
Tags:    

Similar News