Kingdom : విజయ్ దేవరకొండ కింగ్ డమ్ ఎలా ఉందంటే?
కొన్ని ఏళ్ల నుంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన మూవీ కింగ్ డమ్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది
కొన్ని ఏళ్ల నుంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన మూవీ కింగ్ డమ్ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంపై విజయ్ అభిమానులు అంచనాలు ఎక్కువగా పెట్టుకున్నారు. అనేక సార్లు వాయిదా పడిన అనంతరం ఈ మూవీ విడుదల కావడంతో పాటు చిత్ర ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో జరగడపై చిత్రంపై బజ్ క్రియేట్ అయింది. నేడు ప్రీమియర్స్ తో ప్రపంచ వ్యాప్తంగా విడుదలయని ఈ మూవీ ఎలా ఉందన్న ఫస్ట్ టాక్ మాత్రం బాగానే వచ్చింది.
విజయ్ నటన పరంగా...
విజయ్ దేవర కొండ నటనకు హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వేయవచ్చు అంటున్నారు. సూరి పాత్రలో విజయ్ దేవరకొండ ఎంట్రీ కూడా అదిరిపోవడంతో థియేటర్లలో ఫ్యాన్స్ కు ఇక పట్టపగ్గాలు ఉండటం లేదు. దర్శకుడు గౌతమ్ తిన్నసూరి కథను డీల్ చేసిన విధానం బాగుందన్న టాక్ బాగుంది. ల్యాగ్ లేకుండా కథనాన్ని నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారంటున్నారు. అయితే కథలో లోపాలు కనిపించినప్పటికీ విజయ్ నటన, కథ, యాక్షన్ ముందు అవి కొట్టుకుపోయాయని చెబుతున్నారు.
క్లైమాక్స్ సీన్ మాత్రం...
ఫస్టాఫ్ తో పాటు సెకండాఫ్ ను కూడా పర్ ఫెక్ట్ గానే దర్శకుడు తీసుకెళ్లడంతో పాటు క్లైమాక్స్ సీన్ అదిరిపోవడంతో విజయ్ దేవరకొండ ఖాతాలో కొన్ని ఏళ్ల తర్వాత హిట్ పడినట్లేనని ఓవర్సీస్ నుంచి అందుతున్న టాక్. ఫస్టాఫ్ బాగా తీసిన దర్శకుడు సెకండాఫ్ లో స్టోరీని నడిపించడంలో కొంత తడబడినా ప్రీ క్లైమాక్ నుంచి సినిమా మరింత వేగం అందుకోవడంతో పాటు క్లైమాక్స్ అదరగొట్టాడంటున్నారు. దీంతో పాటు సంగీత దర్శకుడు అనిరుధ్ అందించిన బీజీఎం బూస్ గమ్స్ ను తెప్పింస్తుందంటున్నారు. ఈచిత్రంలో విజయ్ దేవర కొండ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించారు. హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ కు ఈ మూవీ చాలా వరకూ రిలీఫ్ తెచ్చిపెట్టిందన్న టాక్ వినపడుతుంది.