Harihara Veramallu : హరిహర వీరమల్లు అలరించాడా? అదరగొట్టాడా?

పవర్ స్టార్ ఫ్యాన్స్ దీర్ఘకాలంగా ఎదురు చూసిన పవన్ కల్యాణ్ నటించిన హరిహరవీరమల్లు విడుదలయింది

Update: 2025-07-24 02:47 GMT

పవర్ స్టార్ ఫ్యాన్స్ దీర్ఘకాలంగా ఎదురు చూసిన పవన్ కల్యాణ్ నటించిన హరిహరవీరమల్లు విడుదలయింది. ఓవర్సీస్ లో ముందుగానే విడుదల కావడంతో ఈ చిత్రానికి సబంధించిన రివ్యూలు బయటకు వచ్చేశాయి. పవన్ కల్యాణ్ మూవీ అంటే రోమాలు నిక్క బొడుచుకుంటాయి. ఎంట్రీ నుంచి ఎండింగ్ వరకూ పవన్ ను దేవుడిగా ఆరాధించే ఫ్యాన్స్ లక్షల మంది ఉన్నారు. అలాంటి లక్షలాది మంది అభిమానుల ఆశలను దర్శకులు నిజం చేశారా? లేదా? అన్నది ఓవర్సీస్ రివ్యూ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పీరియాడిక్ మూవీతో పాటు యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై తొలి నుంచి భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

రన్ టైమ్ కూడా...
అయితే దర్శకుడు క్రిష్ కథతో పాటు తొలి దశలో దర్శకత్వం వహించడం తర్వాత ఆయన వ్యక్తిగత కారణాలతో పక్కకు తప్పుకోవడంతో ఎంఎంరత్నం కుమారుడు జ్యోతి కృష్ణ మిగిలిన సినిమాకు దర్శకత్వం వహించారు. పవన్ ఎంట్రీ అదిరిపోయిందంటున్నారు కుస్తీ వంటి సన్నివేశాలతో పాటు డైలాగులతో కూడా ఫ్యాన్స్ లో జోష్ పెంచాడని చెబుతున్నారు.అయితే కథ అంతా విసుగు పుట్టించేలా ఉండటం మైనస్ పాయింట్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మాత్రం అదరగొట్టాడని, సెకండాఫ్ కు వచ్చే సరికి ఫ్యాన్స్ ఈ మూవీపై పెట్టుకున్న అంచనాల ప్రకారం వెళ్లలేదని అంటున్నారు. రన్ టైమ్ కూడా కొంత ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. 164 నిమిషాల నిడివి కావడంతో కొంత ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారని అంటున్నారు.
ఫస్ట్ హాఫ్ సూపర్ అయినా...
ఇక ఫస్ట్ హాఫ్ సూపర్ గానే ఉందని చెబుతున్నప్పటికీ సెకండాఫ్ నుంచి మూవీ కొంత బోర్ కొట్టించిందని చెబుతున్నారు. కోహినూర్ వజ్రం కోసం గోల్కొండ నుంచి ఢిల్లీకి హరిహర వీరమల్లు ప్రయాణం కుర్చీల్లో కూర్చున్న ఫ్యాన్స్ కు కూడా అసహనం తెప్పించిందంటున్నారు. సంగీత దర్శకుడు కీరవాణి మ్యూజిక్ తో మరో సారి మంచి సినిమాకు సంగీతం అందించాడని చెబుతున్నప్పటికీ, ఇందులో వీఎఫ్ఎక్స్ పవన్ ఫ్యాన్స్ ఊహించుకున్నంత రేంజ్ లో లేవని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ నటనకు పేరు పెట్టడానికి లేకపోయినా.. దర్శకుడికి అనుభవలేమి సెకండాఫ్ లో స్పష్టం కనిపించిందన్న టాక్ ఓవర్సీస్ నుంచి వినిపిస్తుంది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఫ్యాన్స్ దానిని రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి. మొత్తం మీద సుదీర్ఘకాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై తమ అభిమాన హీరో పవన్ చూసిన పీకే ఫ్యాన్స్ కు మాత్రం చాలా చోట్ల గూస్ బమ్స్ రావడం ఖాయమని అంటున్నారు.


Tags:    

Similar News