kishkindhapuri : కిష్కింధ పురి మూవీ పై టాక్ ఎలా ఉందంటే?
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కింధపురి మూవీ ఈరోజు థియేటర్లలో విడుదలయింది.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కింధపురి మూవీ ఈరోజు థియేటర్లలో విడుదలయింది. హార్రర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీలో అనుపమ హీరోయిన్ గా నటించింది. ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ బాగా చేయడంతో కిష్కింధపురికి మంచి హైప్ ఏర్పడింది. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ మూవీలో రాఘవ పాత్రలోనూ, అనుపమ మైధిలిగా నటించారు. హీరోయిన్లు ఇద్దరూ థ్రిల్ కోరుకునే వారి కోసం హంటెడ్ హౌసెస్ టూర్స్ ను నిర్వహిస్తుంటారు. అక్కడ దెయ్యాలు ఉన్నాయని వారిని నమ్మిస్తూ థ్రిల్ కు గురి చేయడమే ఈ చిత్రం ప్రధాన కథ. అయితే అనేక ట్విస్టులు చోటుచేసుున్నాయి. అందులో భాగంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్ అనుపమలు కలసి పదకొండు మంది సభ్యులతో కలసిన ఒక బృందంతో కిష్కింధపురిలోని సువర్ణపురి రేడియో స్టేషన్ లోకి అందరూ కలసి వెళతారు.
ట్విస్ట్ లతో అలరించి...
అక్కడి నుంచి అసలు ట్విస్ట్ మొదలవుతుంది. 1989 వ ప్రాంతంలో రేడియో స్టేషన్ లో పనిచేసిన వేదవతి వాయిస్ లో ఈ పదకొండు మందికి హెచ్చరికలు వినిపిస్తాయి. అయితే దానిని లెక్క చేయరు. అయితే ఆ రేడియో స్టేషన్ లోకి వెళ్లిన పదకొండు మందిలో ఎవరినీ వదిలిపెట్టనని వేదవతి వాయిస్ లో చెప్పినా పట్టించుకోరు. కానీ ఆ పదకొండు మంది బ్యాచ్ లో ముగ్గురు మరణిస్తారు. ఆ పదకొండు మందిలో ఒక చిన్నారి కూడా ఉంది. ఆచిన్నారిని కాపాడటానికి హీరో చేసిన సాహసమేంటన్నది కథ. అయితే కిష్కింధపురి ఫస్ట్ హాఫ్ మొత్తం దెయ్యం అరుపులతో భయపెట్టలా సాగింది. దెయ్యాన్ని చూపించి ఇటు రేడియో స్టేషన్ లోకి వెళ్లిన బృందంతో పాటు ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ఫస్ట్ హాఫ్ మొత్తం...
కానీ సెకండాఫ్ లో మాత్రం కాస్త వేగం తగ్గింది. కానీ కిష్కింధపురి కథ మొత్తం ట్విస్ట్ లతో సాగుతుండటం ప్రేక్షకులను కొంత థియేటర్లలో కుర్చీలకు కట్టిపడేస్తుందని చెప్పాలి. లాజిక్ లు వెతక్కుండా చూసేవారికి మాత్రం ఈ మూవీ నచ్చుతుందని అంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు, నిర్మించిన తీరు కూడా ఆకట్టుకునేలా సాగింది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త జోనర్ లో నటించి మెప్పించారనే చెప్పాలి. ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించగా, సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. మొత్తం మీద మూవీ ఒకసారి థియేటర్ లోనే చూస్తే థ్రిల్ ఫీలయ్యేలా ఉందన్న టాక్ మాత్ర్రం వినిపించింది. అయితే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి.