రివ్యూ: 'రామా రావు ఆన్ డ్యూటీ'

ఈ చిత్రం 90ల నేపథ్యంలో సాగుతుంది. రామారావు(రవితేజ) రెవెన్యూ అధికారి..

Update: 2022-07-29 10:41 GMT

విడుదల తేదీ : జూలై 29, 2022

నటీనటులు: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, 'సార్‌పట్ట' ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ.. తదితరులు
దర్శకుడు: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సంగీత దర్శకుడు: సామ్ సి.ఎస్.
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్.
వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న టాలీవుడ్ నటులలో రవి తేజ ఒకరు. ఆయన నుండి తాజాగా వచ్చిన సినిమా 'రామా రావు ఆన్ డ్యూటీ'..! గత కొద్ది వారాలుగా తెలుగు సినిమా అభిమానులకు మంచి సినిమా రాలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా హాల్స్ కు వచ్చి కూడా చాలా రోజులే అవుతోంది. రవితేజ లాంటి స్టార్ సినిమా మీద సినీ ప్రేక్షకులు కూడా అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలను రామారావు అందుకున్నారా లేదా అనేది ఈ శుక్రవారం ప్రేక్షకులే నిర్ణయించాలి.
కథ:
ఈ చిత్రం 90ల నేపథ్యంలో సాగుతుంది. రామారావు(రవితేజ) రెవెన్యూ అధికారి.. ఏదైనా చేసి బాధితులకు అండగా నిలుస్తూ ఉంటాడు. అయితే కొన్ని కారణాల వలన తాను పని చేసే ప్రాంతం నుండి ట్రాన్స్ఫర్ అయ్యి.. సొంత ఊరిలో డ్యూటీ చేసుకుంటాడు. కథ మొత్తం చిత్తూరు జిల్లా బ్యాగ్డ్రాప్ లోనే సాగుతుంది. ఇక విధుల మీద వచ్చిన రామా రావుకు తన మాజీ ప్రియురాలు మాలిని (రజిషా విజయన్)ని కలుస్తాడు. ఆమె తన భర్త తప్పిపోయాడని అతనికి తెలియజేస్తుంది. సహాయం చేయమని అడుగుతాడు. రామారావు తన దర్యాప్తు ప్రారంభించి, తన గ్రామంలో కూడా చాలా మంది కనిపించకుండా పోయారని, ఇదంతా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించినదని తెలుసుకుంటాడు. రామా రావు దగ్గర ఉన్న వాళ్లకు ఈ మిస్సింగ్ లతో ఏమి సంబంధం. వీటన్నింటి వెనుక ఎవరున్నారు, రామారావు కేసును ఎలా ఛేదించాడు అనేది కథ.
ప్లస్ పాయింట్లు
రవితేజ తన సిన్సియర్ పెర్‌ఫార్మెన్స్‌తో పర్వాలేదనిపించాడు. రెవెన్యూ అధికారిగా తన పాత్రలో బాగా చేశాడు. పాటలు సినిమాను కాస్త స్లోగా నడిపిస్తాయి. నాజర్, తనికెళ్ల భరణి పర్వాలేదనిపించారు. తొట్టెంపూడి వేణు రీఎంట్రీ మంచి పాత్రతో ఇచ్చాడు. అయితే సినిమాలో అతని పాత్ర పెద్దగా కనిపించలేదు. డిఫరెంట్ షేడ్స్ ఉన్నా.. ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. ఇక ఇద్దరు హీరోయిన్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
మైనస్ పాయింట్లు:
దర్శకుడు శరత్ మండవ ఒక మంచి కథాంశాన్ని తీసుకున్నాడు, కానీ తీసిన విధానం ప్రేక్షకులకు కన్ఫ్యూజ్ చేస్తుంది. మరీ ఎక్కువగా బోర్ కొట్టకపోయినా.. ఎక్కడో పేస్ తగ్గిందని అనిపిస్తుంది. సరైన విలన్ లేడు. సరైన విలన్ లేకపోవడంతో హీరో కేసును సులువుగా ఛేదిస్తాడు. భావోద్వేగాలపై సరైన పట్టు లేదు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లు గ్రిప్పింగ్‌గా ఉండాలి.. కానీ సినిమాలో సన్నివేశాలు కొన్ని బాగా.. ఇంకొన్ని ల్యాగ్‌గా ఉండటం ప్రేక్షకులకు పెద్దగా నచ్చేలా అనిపించకపోవచ్చు. సినిమాలో పాటలు లేకుండా చేసి ఉంటే.. ఇంకా బాగుండేదని తప్పకుండా అనిపిస్తుంది. కథాకథనాల దగ్గరే గందరగోళం అయింది. డైలాగ్స్, యాక్షన్, డాన్స్ పరంగా కూడా రవితేజ మార్క్ మిస్సయింది. ఇక చిత్తూరు యాస విషయంలో చాలా తప్పులే చేశారు.
సాంకేతిక అంశాలు
సినిమా నిర్మాణ విలువలు డీసెంట్‌గా ఉన్నాయి. 90ల సెటప్‌ను చూపించేందుకు కెమెరా పనితనం బాగా ఉంది. డైలాగ్స్ డీసెంట్ గా ఉన్నాయి, ప్రొడక్షన్ డిజైన్ కూడా అలాగే ఉంది. దర్శకుడు శరత్ మండవ విషయానికి వస్తే, అతను తన డెబ్యూ మూవీతో పర్వాలేదనిపించాడు. రవితేజను సరిగ్గా వాడుకోలేదు. సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్, డ్రామా ఏమీ పెద్దగా కనిపించలేదు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ బాగుంది. అడవి నేపథ్యంలో సన్నివేశాలను .. రెయిన్ ఎఫెక్ట్ లోని దృశ్యాలను .. పాటలకు అందాన్ని తీసుకొచ్చే విజువల్స్ ను గొప్పగా ఆవిష్కరించాడు. బీజీఎం పర్వాలేదు.


Tags:    

Similar News