Kubera : శేఖర్ కమ్ముల మరో సారి కుమ్మేశాడా? కుబేర ఎలా ఉందంటే?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుదీర్ఘకాలం తర్వాత విడుదలయిన కుబేర మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది

Update: 2025-06-20 05:54 GMT

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుదీర్ఘకాలం తర్వాత విడుదలయిన కుబేర మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నట్లే కనపడుతుంది. భారీ అంచనాల మధ్య నేడు కుబేర వరల్డ్ వైడ్ విడుదలయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలివుడ్ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున నటించడంతో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీలో నటించారు. అయితే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఈ మూవీకి మంచి మార్కులే పడ్డాయి. శేఖర్ కమ్ములకు ప్రత్యేక ఆడియన్స ఉన్నారు. ఆయన దర్శకత్వం వహించిన హ్యాపీడేస్, ఆనంది, గోదావరి, ఫిదా వంటి చిత్రాలు బాక్సాఫీసు ఎదుట సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ మూవీ కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని క్రిటిక్స్ సయితం అభిప్రాయపడుతున్నారు.

క్రైమ్ డ్రామాగా...
శేఖర్ కమ్ముల క్రైమ్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు. పేద వాడు, ధనవంతుడు మధ్య ఉన్న సంబంధం అనే అంశాన్ని తీసుకుని సెల్యూలాయిడ్ పై తనదైన శైలిలో ఎక్కించాడు. సినిమా ఆరంభం నుంచి చివర వరకూ ఎక్కడా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా తీసుకెళ్లడంలో శేఖర్ కమ్ముల సక్సెస్ అయ్యారంటున్నారు. ఇక ధనుష్ ఈ సినిమాలో మంచి నటన కనపర్చారని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఇక నాగార్జునకు పేరు పెట్టాల్సిన పనిలేదు. తనకు ఇచ్చిన పాత్రలో నాగార్జున ఒదిగిపోవడంతో సినిమాకు మరింత హిట్ టాక్ వచ్చినట్లయిందంటున్నారు.
అద్భుతమైన కథతో...
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఎంతగానో ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను అలరించింది. సినిమా ద్వితీయార్థంలో సెంటిమెంట్ సీన్స్ ప్రేక్షకులను కదిలించేలా ఉన్నాయట. అయితే ఎడిటింగ్ లో అక్కడక్కడ కొంత లోపాలు కనిపించాయని కూడా అంటున్నారు. మూడు గంటల నిడివి గల సినిమా అప్పుడే అయిపోయిందా? అని పించేలా శేఖర్ కమ్ముల ఈ సినిమాను తీశారంటున్నారు. అద్భుతమైన కథతో ప్రేక్షకులను కుర్చీ నుంచి కదలకుండా చేయడంలో శేఖర్ కమ్ముల సక్సెస్ అయ్యాడన్న టాక్ ఓవర్సీస్ లో వినిపిస్తుంది



















Tags:    

Similar News