థామస్ కప్ డబుల్స్ టైటిల్ భారత్ దే.. ఫైనల్స్ లో చెలరేగిన సాయిరాజ్-చిరాగ్
ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్య సేన్ చెలరేగింది. సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్‌శెట్టి టైటిల్ పోరులో
థామస్ కప్ లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 14 సార్లు చాంపియన్ అయిన ఇండోనేషియాతో తలపడిన భారత్ పురుషుల బ్యాడ్మింటన్ జట్టు.. విజేతగా నిలిచింది. బ్యాంకాక్ వేదికగా జరిగిన ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి భారత్ ఫైనల్స్ కు చేరింది. నాకౌట్ దశలో మలేషియా, డెన్మార్క్ జట్లను ఓడించి.. తుదిపోరులో అడుగుపెట్టింది. అలాగే ఇండోనేషియా జట్టు చైనా , జపాన్ లను ఓడించి ఫైనల్స్ లో భారత్ తో పోటీ పడింది.
ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్య సేన్ చెలరేగింది. సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్‌శెట్టి టైటిల్ పోరులో సత్తా చాటారు. ఇండోనేషియాకు చెందిన అసాన్, సంజయ జోడిపై విజయం సాధించారు. మూడు సెట్ల పాటు సాగిన టైటిల్ వేటలో సాత్విక్, చిరాగ్ జోడి 18-21, 23-21, 21-19 తో గెలిచారు. తొలి సెట్‌ను ఓడి డిఫెన్స్‌లో పడిపోయినట్లుగా కనిపించిన సాయిరాజ్, చిరాగ్‌ల జోడి ఆ వెంటనే జూలు విదిలించింది. రెండు, మూడు సెట్లలో వరుసగా నెగ్గి.. డబుల్స్ టైటిల్ ను సొంతం చేసుకుంది. 14సార్లు టైటిల్ ఛాంపియన్ గా నిలిచిన ఇండోనేషియాను ఓడించడం అంత తేలిక కాదు. భారత్ కు ఈసారి కూడా టైటిల్ రాదని అందరూ భావించారు. కానీ.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ.. సాయిరాజ్, చిరాగ్ జోడి భారత్‌కు థామస్ కప్‌లో తొలి టైటిల్‌ను అందించారు.