Earth Quake : ఇండోనేషియాను వణికించిన భూకంపం

ఇండోనేషియాను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో నమోదయింది.

Update: 2026-04-02 03:06 GMT

ఇండోనేషియాను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో నమోదయింది. అనేక ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. సునామీ అలలు కారణంగా ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరికొందరికి గాయాలయ్యాయని చెప్పారు.

రిక్టర్ స్కేల్ పై...
ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 7.48 గంటలకు ఈ భూకంపం సంభవించింది. భూకంప కేంద్ర టెర్నాటే నగరానికి 127 కిలోమీటర్ల దూరంలో ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News