Iran : భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ఇరాన్
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో స్పందిస్తూ భారత నౌకలకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది. "భారత మిత్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు పూర్తిగా సురక్షితంగా ఉన్నారు" అని పేర్కొంది. హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన మార్గంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో సుమారు 20 శాతం చమురు రవాణా ఈ మార్గం ద్వారానే జరుగుతోంది.
మిత్ర దేశాలకు జలసంధిలో ఓకే...
ఇజ్రాయెల్, అమెరికాతో ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత ఈ మార్గంలో నౌకల రాకపోకలపై పరిమితులు విధించారు. అయితే ఇరాన్ స్నేహపూర్వక దేశాలకు అనుమతి ఇస్తుంది. భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్ వంటి స్నేహపూర్వక దేశాలకు చెందిన నౌకలకు మాత్రం అనుమతి ఇస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల భారత్‌కు కొంత ఊరట లభించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.ఇప్పటివరకు ఎనిమిది భారత నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్లు తెిలిసింది.