Ys Jagan : నేడు సీబీఐ కోర్టుకు జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. సీబీఐ కోర్టులో హాజరు కానున్నారు

Update: 2025-11-20 01:50 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. సీబీఐ కోర్టులో హాజరు కానున్నారు. న్యాయస్థానం సూచన మేరకు జగన్ నేడు ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో హాజరు కానున్నారు. గత నెలలో న్యాయస్థానం అనుమతితోనే జగన్ యూరప్ పర్యటనకు వెళ్లారు. అయితే ఫోన్ నెంబరు తప్పు ఇచ్చారని చెబుతూ ఈసారి విచారణకు మినహాయింపు ఇవ్వవద్దని సీబీఐ తరుపున న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు.

కోర్టు ఆదేశాలతో...
యూరప్ పర్యటన నుంచి వచ్చిన తరవ్ాత ఈ నెల 14వ తేదీ లోపు కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆన్ లైన్ లో హాజరవుతానని జగన్ కోరినా సీబీఐ అందుకు అనుమతించలేదు.దీంతో ఈ నెల 21వ తేదీలోగా హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశం మేరకు ఈ నెల 20వ తేదీన సీబీఐ కోర్టుకు వచ్చి హాజరవుతానని జగన్ మెమో దాఖలు చేశారు. దీంతో ఈరోజు ఉదయం సీబీఐ కోర్టుకు రానున్నారు. కోర్టు ప్రాంగణంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.


Tags:    

Similar News