Hyderabad : కోటి రూపాయల దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కోటి రూపాయల దోపిడీని పోలీసులు గంటల వ్యవధితో ఛేదించారు

Update: 2026-03-17 13:47 GMT

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కోటి రూపాయల దోపిడీని పోలీసులు గంటల వ్యవధితో ఛేదించారు. దారి దోపిడీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 77 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు బృందాలుగా ఏర్పడి సీసీ టీవీ కెమెరాల ద్వారా వారు ఎక్కడకు వెళ్లారన్నది గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.

శంషాబాద్ వద్ద...
శంషాబాద్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని పాతబస్తీలోని బహుదూర్ పురకు చెందిన అజీముద్దీన్ డబ్బుతో వెళుతుండగా నలుగురు వ్యక్తులు బైక్ లపై వచ్చి కళ్లలో కారం కొట్టి కోటి రూపాయల నగదును దోచుకెళ్లారు. అయితే ఈ ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారిని పట్టుకోవడంతో నగదుతో పాటు నిందితులు కూడా దొరికారు. పోలీసులు నలుగురి నిందితులను విచారణ చేస్తున్నారు.


Tags:    

Similar News