Gold Prices Today : భారీగా పడిపోతున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే?
బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి.
బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఇంతలా ఇన్ని రోజుల నుంచి ధరలు తగ్గడం ఇదే తొలిసారి. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మొదలయి రెండు వారాలు గడుస్తున్నప్పటికీ బంగారం ధరలు ఏమాత్రం పెరగకపోగా, తగ్గుతుండటం వినియోగదారులకు చాలా ఊరట కలిగిస్తుంది. ప్రధానంగా సీజన్ సమయంలో ధరలు తగ్గుతుండటం శుభపరిణామమనే చెప్పుకోవాలి. దీంతో బంగారం, వెండి విక్రయాలు కూడా ఊపందుకున్నాయని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు.
భారతీయ సంస్కృతిలో...
బంగారం అనేది భారతీయ సంస్కృతి, సంప్రదాయంలో ఒక భాగమయింది. బంగారం అంటే మక్కువ అనేది అందరికీ ఉంటుంది. కానీ కొనుగోలు చేయాలంటే ఇప్పటి వరకూ ధరలు అందుబాటులో లేవు. గత వారం రోజుల నుంచి ధరలు దిగివస్తున్నాయి. ఒకరోజు స్వల్పంగా, మరికొన్ని రోజులు భారీగానే ధరలు తగ్గుతున్నాయి. అయితే గత ఏడాది ఆరంభం నుంచి భారీగా పెరిగిన ధరలు తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం చాలా కష్టం. అందుకే ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని, రానున్న కాలంలో ధరలు తగ్గుతాయన్న గ్యారంటీ ఏమీ లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
నేటి ధరలు...
మరొకవైపు బంగారం, వెండి పై పెట్టుబడి పెట్టిన వారు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటు పెట్టిన పెట్టుబడులు వెనక్కి తీసుకోలేక వేచి చూసేవాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై రెండు వేల రూపాయల వరకూ తగ్గింది. కిలో వెండి ధరపై ఐదు వేల రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,44,290 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,57,410 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,75,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.