BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన
మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి ప్రదర్శనగా వచ్చారు
మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి ప్రదర్శనగా వచ్చారు. గన్‌పార్క్ నుంచి అసెంబ్లీ వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ర్యాలీ నిర్వహించారు. మొక్కజొన్న రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని,వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మొక్కజొన్న రైతులకు మద్దతుగా...
గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని మొక్క జొన్న రైతులను ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ వచ్చిన బీఆర్ఎస్ నేతల చేతుల్లో ఉన్న ప్లకార్డులను అసెంబ్లీలోకి పోలీసులు అనుమతించలేదు.