Gold Price Today : గుడ్ న్యూస్... బంగారం ఇక అందుబాటులోకి.. ధరలు ఎంత తగ్గాయో తెలుసా?
ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
బంగారం ధరలు మరింత దిగి వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరల పతనం ప్రారంభమయ్యాయి. వెండి ధరలు కూడా భారీగా పతనమవుతున్నాయి. బంగారం, వెండి ధరలు ఇక తగ్గవేమో అని ఆందోళన చెందిన వారికి ఊరట కలిగించేలా గత కొద్ది రోజుల నుంచి ధరలు తగ్గుతుండటం విశేషం. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మొదలయి రెండు వారాలయినప్పటికీ ధరలు పెరగకపోవడంతో చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. అందులోనూ పెళ్లిళ్లు, శుభకార్యాలు జోరుగా జరుగుతుండటంతో ఇక ధరలు తగ్గడమే కానీ పెరగవని ఫిక్స్ అయిపోయారు.
మరింత చేరువగా...
ఇంకా ధరలు .. మరింతగా చేరువగా బంగారం, వెండి తమకు చేరువవుతుందని ఆశిస్తున్నారు. అయితే బంగారం, వెండి విషయంలో ఎవరి అంచనాలు ఎప్పుడూ నిజం కావు. పెరుగుతాయని అనుకున్న సమయంలో ధరలు తగ్గడం, తగ్గుతాయని భావించిన సమయంలో ధరలు పెరగడం బంగారం, వెండి ఆభరణాల విషయంలో మామూలే. అందుకే ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని చాలా మంది సూచిస్తున్నారు. అయితే ధరలు ఇంకా తగ్గుతాయని చాలా మంది కొనుగోలు దారులు వెయిట్ చేస్తున్నారు. అది తప్పుడు అంచనా అని బిజినెస్ ఎక్స్ పెర్ట్స్ కూడా చెబుతున్నారు.
ధరలు తగ్గి...
బంగారం, వెండి ధరలు తగ్గుతుండటంతో కొంత కొనుగోలు దారులు ఆసక్తి చూపుతున్నారు. జ్యుయలరీ దుకాణాలకు కొంత గిరాకీ పెరిగింది. అయితే అనుకున్న స్థాయిలో పెరిగలేదని వ్యాపారులు చెబుతున్నారు. ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,46,340 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,59,650 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 2,79,900 రూపాయలకు చేరుకుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చని నిపుణులు చెబుతున్నారు.