హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. వారికి పక్కా ఇళ్లు

పట్టణ ప్రాంత పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2026-03-17 02:31 GMT

పట్టణ ప్రాంత పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప‌ట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైద‌రాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మ‌ల్కాజిగిరి జిల్లాల క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేయాల‌నిమంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

పారదర్శకంగా ఎంపిక...
హైదరాబాద్ న‌గ‌రంలో నివ‌సించే పేద ప్రజ‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా స్థలాల‌ను గుర్తించాల‌ని సూచించారు. సోమ‌వారం మంత్రులతో కలిసి స‌మీక్షలో మాట్లాడారు. ప‌ట్టణ ప్రాంతాల్లో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామ‌ని చెప్పారు. ల‌బ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాల‌ని.. ఎలాంటి రాజ‌కీయ ఒత్తిళ్లకు త‌లొగ్గొద్దని ఆదేశాలు జారీ చేశారు.


Tags:    

Similar News