Hyderabad : 24 ఏళ్ల తర్వాత కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధరెడ్డి

సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్ధార్ధరెడ్డి న్యాయస్థానంలో లొంగిపోయారు

Update: 2026-03-17 02:26 GMT

సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్ధార్ధరెడ్డి న్యాయస్థానంలో లొంగిపోయారు. ఇరవై నాలుగేళ్ల తర్వాత కనిపించాడు.సుప్రీంకోర్టు తుది తీర్పు మేరకు నాంపల్లి కోర్టులో సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోయారు. ఇరవై నాలుగేళ్ల నుంచి అమెరికాలో స్థిరపడిన సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో కోర్టులో లొంగిపోయారు. 2002 ఫిబ్రవరి 23న కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకునిసిద్ధార్థ రెడ్డి, ప్రత్యూష తాగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా సిద్ధార్థ్ రెడ్డి కోలుకున్నారు. ప్రత్యూషది ఆత్మహత్య కాదు హత్యేనంటూ ఆమె తల్లి న్యాయపోరాటం చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో...
ప్రత్యూష ఆత్మహత్యకు సిద్ధార్థ్ రెడ్డి ప్రేరేపించిన అభియోగాలపై ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా.. శిక్షాకాలాన్ని హైకోర్టు రెండేళ్లకు తగ్గించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సుదీర్ఘకాలం పాటు విచారణ సాగిన తర్వాత తుదితీర్పులో హైకోర్టు తీర్పును సమర్థిస్తూ.. సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. సిద్ధార్థ్ రెడ్డిని నాలుగు వారాల్లోగా లొంగిపోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిడంతో సుప్రీం ఆదేశాల మేరకు నాంపల్లి కోర్టులో లొంగిపోయారు.


Tags:    

Similar News