Hyderabad : అత్తాపూర్ లో హైడ్రా ప్రభుత్వ స్థలం స్వాధీనం

హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఆక్రమిత స్థలాన్ని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు

Update: 2026-03-15 03:05 GMT

హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఆక్రమిత స్థలాన్ని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి బ్లూ షీట్స్ ను ఏర్పాటు చేసుకుని కొందరు ఆక్రమణకు యత్నించడంతో ఈరోజు ఉదయం నుంచి హైడ్రా అధికారులు వాటిని కూల్చివేస్తున్నారు. ఈ స్థలం విలువ కోట్ల రూపాయల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కోట్ల విలువ చేసే స్థలం...
హైడ్రా అధికారులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆరోజు ఉదయం బుల్ డోజర్ తో వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన బ్లూషీట్స్ ను తొలగించారు. తొలగించిన బ్లూ షీట్స్ స్థానంలో ప్రభుత్వ స్థలం అని బోర్డు కూడా హైడ్రా అధికారులు పెట్టారు. హైడ్రా అధికారులు, పోలీసుల రాకతో అక్కడ ఆక్రమణదారులు పరారయినట్లు తెలిసింది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలను చేపట్టారు.


Tags:    

Similar News