Khairthabad Ganesh : ఖైరతాబాద్ గణేశ్ కర్ర పూజ .. ఈ ఏడాది ఏ రూపంలో అంటే?

ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ తయారీ పనులు ప్రారంభమవుతాయి

Update: 2025-06-06 11:54 GMT

ఖైరతాబాద్ గణేశ్ విగ్రహానికి సంబంధించి కర్ర పూజ నేడు మొదలయింది. దీంతో నేటి నుంచి ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ తయారీ పనులు ప్రారంభమవుతాయి. వినాయక చవితి నాటికి గణేశ్ విగ్రహ నిర్మాణం పూర్తి చేయాలంటే కొన్ని నెలలు ముందుగా వందల సంఖ్యలో కార్మికులు నిరంతరం పనిచేస్తారు. అప్పుడే వినాయక చవితి నాటికి ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం సందర్శించుకుంటారు.

69 అడుగుల ఎత్తులో...
ఈసారి 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని నిర్మించడానికి ఉత్సవ సమితి నిర్ణయించింది. శ్రీవిశ్వశాంతి మహా శక్తి గణపతిగా ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశ్ పూజలు అందుకోనున్నారు. ప్రతి ఏటా తొమ్మిది రోజుల పాటు ఖైరతాబాద్ గణేశ్ విగ్రహానికి పూజలు చేసి తర్వాత నిమజ్జనం చేస్తారు. ఈ ఏడాది వినాయక చవితి మరో మూడు నెలలకు ముందు ఖైరతాబాద్ గణేశ్ విగ్రహానికి సంబంధించి కర్రపూజ మొదలయింది.


Tags:    

Similar News