ఈ నెల 20న హైదరాబాద్ కు ఉపరాష్ట్రపతి

ఈనెల 20, 21 తేదీల్లో హైదరాబాద్‌కు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ రానున్నారు

Update: 2025-12-18 04:08 GMT

ఈనెల 20, 21 తేదీల్లో హైదరాబాద్‌కు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ రానున్నారు. రెండు రోజుల పాటు ఉప రాష్ట్రపతి హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ నెల 20వ తేదీన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదసస్సులో రాధాకృష్ణన్ పాల్గొంటారు. అలాగే మరికొన్ని ప్రయివేటు కార్యక్రమాల్లోనూ రాధాకృష్ణన్ పాల్గొంటారు.

రెండు రోజుల పాటు...
ఈ నెల 21న కన్హా శాంతివనంలో ధ్యాన దినోత్సవానికి హాజరుకానున్నారు. ఉప రాష్ట్రపతి రాక సందర్భంగా పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించనున్నారు. ఉప రాష్ట్రపతి పర్యటించే ప్రదేశాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. అలాగే పోలీసులు కూడా విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News