Gold Prices Today : ఉగాది నాడు తీపి కబురు.. తగ్గిన బంగారం, వెండి ధరలు

ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది

Update: 2026-03-19 03:47 GMT

బంగారం, వెండి ధరలు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు నిన్న భారీగా పెరిగాయి. కానీ నేడు మళ్లీ తగ్గాయి. ధరలు తగ్గుతుండటంతో కొంత వినియోగదారులు ఊరట చెందుతున్నారు. మరొకవైపు ఉగాది రోజున బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలు దారులు జ్యుయలరీ దుకాణాలకు క్యూ కట్టే అవకాశముంది. తెలుగు కొత్త సంవత్సరాదిన బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తే శుభప్రదమని భావించి ఎక్కువ మంది కొనుగోలు చేస్తారని వ్యాపారులు చెబుతున్నారు.

ధరలు తగ్గుతూ...
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కారణంగా ధరలు ఇటీవల కాలంలో పెరగలేదు. పైగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ధరలు అందుబాటులోకి వస్తే వాటి డిమాండ్ కూడా పెరుగుతుందని వ్యాపారులు భావిస్తున్నారు. అదే సమయంలో బంగారం విషయంలో ప్రతి ఒక్కరూ ఆచి తూచి అడుగు వేస్తారు. ధరలు తగ్గినప్పుడు ఎక్కువ కొనుగోలు చేస్తారు. బంగారం అంటే అందరికీ మక్కువే. అందులోనూ మహిళలు బంగారం, వెండి కొనుగోలు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. బంగారం విషయంలో మహిళలతో పాటు పురుషులు కూడా ఇటీవల కాలంలో పోటీ పడి కొనుగోలు చేస్తారు.
నేటి ధరలు ఇలా...
బంగారం ఎంత ఎక్కువ మన వద్ద ఉంటే అంత జీవితం భద్రంగా ఉంటుందని భావిస్తారు. కరోనా సమయంలోనూ బంగారం అనేక లక్షలాది మంది జీవితాలను బంగారమే బువ్వ పెట్టింది. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 1900 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై ఐదు వేల రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,44,590 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,57,740 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,74,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.


Tags:    

Similar News