Hyderabad : రథాన్ని లాగుతుండగా ఉప్పల్ లో ఐదుగురి మృతి.. విద్యుత్తు షాక్ తగిలి
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. రామాంతాపూర్ లోని గోకుల్ నగర్ లో ఆదివారం శ్రీకృష్ణ జన్మాన్మష్టమి వేడుకలు నిర్వహిస్తుండగా ఊరేగింపు రథానికి విద్యుత్తు తీగలు తగిలి ఐదుగురు మరణించారు.
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. రామాంతాపూర్ లోని గోకుల్ నగర్ లో ఆదివారం శ్రీకృష్ణ జన్మాన్మష్టమి వేడుకలు నిర్వహిస్తుండగా ఊరేగింపు రథానికి విద్యుత్తు తీగలు తగిలి ఐదుగురు మరణించారు. కృష్ణాష్ణమి కావడంతో ఆదివారం రాత్రి స్థానికులు ఊరేగింపు చేపట్టారు. రథం మరమతులకు గురికావడంతో దానిని చేతులతో లాగాల్సి వచ్చింది.దీంతో రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళుతుండగా రథానికి విద్యుత్తు తీగలు తగిలాయి. దీంతో షాక్ కొట్టి అక్కడికక్కడే ఐదుగురు మరణిించారు. మరో నలుగురు గాయపడ్డారు.
మృతులు వీరే...
అయితే విద్యుత్తు షాక్ తగిలి తొమ్మిది మంది దూరంగా పడిపోవడంతో వెంటనే ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. షాక్ తగిలిన వారిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా అందులో ఐదుగురు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గాయపడిన మరో నలుగురిని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతులను స్థానికంగా ఉండే శ్రీకాంత్ రెడ్డి, సురేశ్ యాదవ్, రాజేంద్రరెడ్డి, కృష్ణ యాదవ్ లుగా గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వారిలో...
గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్ మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే రథం ఎత్తు ఉండటంతో పాటు విద్యుత్తు తీగలను గమనించకుండా రథాన్ని లాగడం వల్ల అవి దానిపైన పడటంతోనే షాక్ తగిలిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాలనీలో ఐదుగురు మరణించడంతో విషాధ చాయలు అలుముకున్నాయి. వర్షం కురుస్తుండటంతో పాటు విద్యుత్తు తీగలను గమనించకుండా రథం లాగినందు వల్లనే ఈ విషాదం చోటు చేసుకుందని ప్రాధమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.