హైదరాబాద్ - విజయవాడ రహదారిపై నిలిచిన వాహనాలు
హైదరాబాద్ - విజయవాడ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ద
హైదరాబాద్ - విజయవాడ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దసరా పండగకు సొంతూళ్లకు బయలుదేరిన వాహనాలతో ఒక్కసారిగా జాతీయ రహదారిపై వాహనాలు కిలోమీటర్లు మేరకు నిలిచిపోయాయి. హయత్ నగర్ లో విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సొంత వాహనాలతో బయలుదేరిన వారు కొందరైతే, వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరిన వారు కూడా ఉన్నారు.
దసరా పండగకు...
వర్షం కొంత తగ్గుముఖం పట్టడంతో ఒక్కసారిగా వాహనాలు రోడ్డుపైకి వచ్చాయి. పండగ పూట సొంతూళ్లకు వెళదామని భావించి బయలుదేరిన వాళ్లు ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. దీనికి తోడు భారీ వర్షాల తో అబ్దుల్లాపూర్ మెంట్ మండలం గౌరెల్లి వద్ద వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రజలు దీంతో ఇబ్బందులు పడుతున్నారు. సొంతూళ్లకు బయలుదేరిన వారు ట్రాఫిక్ సమస్యతో గమ్యస్థానానికి ఆలస్యంగా చేరుకునే అవకాశాలున్నాయి.