Ramdan : హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

ఈరోజు దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు

Update: 2026-03-21 02:56 GMT

ఈరోజు దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చస్తున్నారు. హైదరాబాద్ లోనూ ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు ప్రారంభమయ్యాయి. పాతబస్తీ మీర్ ఆలం ఈద్గాలో ముస్లిం సోదరులు సామూహిక రంజాన్ ఈద్గా ఉల్ ఫితర్ ప్రార్థనలు చేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రార్థనల సమయంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

ఉదయం ఏడు గంటల నుంచి...
మిరాలం ఈద్గా పరిసర ప్రాంతాల్లో ఉదయం ఏడు గంట లనుంచి 11.30 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ప్రధానంగా మీర్ ఆలం ఈద్గా మార్గంతో పాటు, జూపార్క్, బహదూర్ పుర, కాలా పత్తర్, నవాబ్ సాహెబ్ కుంట, పురానాపూల్, శాస్త్రిపురం లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచించారు. ముస్లింల ప్రార్థనల సమయంలో ఎవరినీ అనుమతించబోమని తెలిపారు.
ఈద్ వేడుకలు నేడు...
నెలవంక దర్శనంతో నేడు రంజాన్ పండుగను అత్యంత వేడుకగా ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉత్సాహంగా ఈద్ ఉల్ ఫిత్ర్ వేడుకలు ఆరంభమయ్యాయి.ఉపవాస దీక్షలకు ముగింపు పలుకుతున్న ముస్లింలు, ఈరోజు ఉదయం ప్రత్యేక నమాజ్‌లకు మసీదుల్లో ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులతో శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. పేదలకు దానాలు చేస్తున్నారు. పేదలకు జకాత్, ఫిత్రా విరాళాలు అందజేస్తున్నారు. మసీదులు, ఈద్‌గాహ్‌లలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. భద్రతా ఏర్పాట్లపై పోలీసుల ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్నదానాలు, సామూహిక విందులతో పండుగ సందడి నెలకొంది.


Tags:    

Similar News