Hyderabad : నిలిచిన మెట్రో రైళ్లు.. సాంకేతిక లోపం
జూబ్లీహిల్స్ లో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి.
జూబ్లీహిల్స్ లో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యతో రెండు వైపులా రైళ్లు నిలిచిపోయాయి. అమీర్ పేట్ - రాయదుర్గంమార్గంలో ఈ రైళ్ల రాకపోకలు కొద్దిగా నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మెట్రో స్టేషన్ లో మెట్రో రైలు నిలిచిపోయింది. రెండు వైలు రైళ్లు నిలిచిపోయాయి.
తిరిగి ప్రారంభం కావడంతో...
దాదాపు పన్నెండు నిమిషాలు జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు వద్ద మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. అయితే తర్వాత సాంకేతిక సమస్యలు తొలిగిపోవడంతో తిరిగి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. తిరిగి యధావిధిగా నడుస్తున్నాయి. దాదాపు పన్నెండు నిమిషాలు రైళ్లు నిలిచిపోవడంతో అనేక స్టేషన్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తిరిగి యధాతధంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.