Gold Price Today : భారీగా దిగివస్తున్న బంగారం.. వెండి ధరలు..ఇంకా ఎంతకాలమంటే?

ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి

Update: 2026-03-21 03:46 GMT

బంగారం ధరలు మరింత దిగివస్తున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలు తగ్గుముఖం పడుతుండటమే ఇందుకు కారణం. బంగారం, వెండి ధరలు ప్రతి రోజూ ఎంతో కొంత తగ్గి పసిడిప్రియులకు ఊరట కలిగిస్తున్నాయి. ఎంత తగ్గిందనే దాని కంటే పెరగలేదన్న ఆనందమే కొనుగోలుదారుల్లో కనపడుతుంది. గతంలో ప్రతి రోజూ ధరలు పెరిగేవి. 2025 జనవరి నుంచి ప్రారంభమయిన బంగారం, వెండి ధరల పెరుగుదల ఫిబ్రవరి నెల వరకూ జోరుగా సాగింది. మార్చి రెండో వారం నుంచే కొంత ధరలు దిగివస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

యుద్ధ ప్రభావం ఉన్నా...
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించినప్పటికీ బంగారం, వెండి ధరలపై ప్రభావం పెద్దగా చూపడం లేదు. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో పసిడి పతనం కొనసాగుతుందని బిజినెస్ ఎక్స్ పెర్ట్స్ అంచనా వేస్తున్నారు. మరొకవైపు డాలర్ బలపడటం కూడా దీనికి కారణం. భారత్ కరెన్సీ డాలర్ తో పోలిస్తే గణనీయంగా తగ్గింది. అలాగే పలు దేశాల్లో నెలకొన్న మాంద్యం, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలు కూడా బంగారం, వెండి ఆభరణాల పెరుగుదలపై ప్రభావం చూపుతాయని భావించినా ఆ మేరకు జరగడం లేదు.
నేటి ధరలు...
సీజన్ కావడంతో బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లు కూడా బాగా పెరిగాయి. బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతాయని, అయితే ఇది ఎంతకాలం ఉంటుందో చెప్పలేమని అంటున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,36,540 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,48,900 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,59,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.


Tags:    

Similar News